అగరబత్తీల తయారీ పథకం పేరుతో అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ రూ.25 కోట్ల మేర ఘరానా మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.12,500 ఇస్తామని నమ్మించి రాజమండ్రిలోని మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.