అనకాపల్లి: అగరబత్తీల తయారీ పేరిట రూ.25 కోట్ల మోసం

అగరబత్తీల తయారీ స్కీం పేరుతో అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ రూ.25 కోట్ల మేర ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రూ.లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.12,500 ఇస్తామని నమ్మించి రాజమండ్రిలోని మహిళల నుంచి భారీగా వసూలు చేశాడు. డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్