అనకాపల్లి: షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్ లారీలో మంటలు

కోటవురట్ల మండలం రాజుపేట వద్ద మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా టిప్పర్ లారీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో స్థానికులు నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ లారీ రామన్నపాలెం వద్ద మెటల్ తీసుకురావడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్