అనకాపల్లి: విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

విద్యుదాఘాతంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడు షాపికూల్(28) మృతిచెందిన ఘటన అనకాపల్లి జిల్లా రోలుగుంట(M) కొమరవోలులో చోటుచేసుకుంది. గత పది రోజులుగా రోలుగుంట నుంచి కొమరవోలు వరకు విద్యుత్ లైన్ల మరమ్మతు పనులను పశ్చిమబెంగాల్‌కు చెందిన కార్మికులు చేస్తున్నారు. కాగా లైన్ క్లియరెన్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు గల కారణాలపై రోలుగుంట పోలీసులు విచారణ చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్