నూతన సంవత్సరం 2026 సందర్భంగా, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి. ఎం రమేష్ ప్రజలకు వినూత్న పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు శాలువాలు, బోకేలు, పూలహారాలకు బదులుగా పుస్తకాలు, పెన్నులు మాత్రమే తీసుకురావాలని సూచించారు. జనవరి 1, 2026న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు అనకాపల్లిలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, ప్రజలతో కలిసి ఎంపీ శుభాకాంక్షలు స్వీకరించనున్నారు.