బత్తుల వెంకటేష్ హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ గా బాధ్యతలు...

నక్కపల్లి మండలం దేవవరం గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్, బుధవారం నాడు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన N today news news24 telugu రిపోర్టర్ గా కూడా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కులు అందేలా చూడటం, మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశోధించడం, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం, హింస, వివక్ష, వెట్టిచాకిరి వంటి ఉల్లంఘనలు జరిగినప్పుడు సంఘటనా స్థలాలను పరిశీలించడం వంటివి మానవ హక్కుల అధికారి ప్రధాన బాధ్యతలని తెలిపారు.

సంబంధిత పోస్ట్