అనకాపల్లి పట్టణం గవరపాలెం అంబేద్కర్ నగర్‌లో గుర్తుతెలియని దుండగులు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం కన్నును ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహం ధ్వంసంపై దళిత సంఘాల నేతలు, అంబేద్కర్ నగర్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్య సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత నేతలు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.