దేవరాపల్లి: బేకరీ షాప్ యజమానిపై 6-ఏ కేసు

దేవరాపల్లి మండల కేంద్రంలోని ఓ బేకరీ షాప్‌లో వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సివిల్ సప్లయి డీటీ ఏ.రవిబాబు మంగళవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. షాపు యజమానిపై 6-ఏ కేసు నమోదు చేసి, గ్యాస్ సిలిండర్‌ను సీజ్ చేశారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్