అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పల్లపు సోమవరం గ్రామానికి చెందిన 70 ఏళ్ల బంతికల ఆదినారాయణ గత నెల 20వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆయన కుమారుడు కసింకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడమ కాలు లేని, ప్లాస్టిక్ కాళ్లతో నడిచే ఆదినారాయణ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కాకినాడ వెళ్తానని చెబుతున్నాడని, అయితే ఆయన ఆచూకీ ఎక్కడా లభ్యం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరికైనా కనిపించినా లేదా ఆచూకీ తెలిసినా కసింకోట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.