అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి జాతీయ రహదారిపై సోమవారం, 29 జూన్ 2026న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి నుంచి అన్నవరం వెళ్తున్న ఈశ్వరరావు, గాయత్రి దంపతుల స్కూటీని ఐచర్ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మహిళ గాయత్రి వ్యాన్ క్యాబిన్లోకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నక్కపల్లి ఎస్సై సన్నీ బాబు, కానిస్టేబుల్స్ ట్రాఫిక్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.