కోటఉరట్ల మండలం నుంచి రేపు పోలవరం ఎడమ కాలువ జల హారతి కోసం పాయకరావుపేట బస్సుల్లో వెళ్లే రైతుల కోసం మూడుచోట్ల పుడ్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఏడు గ్రామాల రైతులకు గొట్టివాడలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ వద్ద ఇన్చార్జిగా ఏవో నాగేశ్వరావును నియమించామన్నారు. సంకపూర్ స్టాక్ పాయింట్ వద్ద ఇన్చార్జిగా హౌసింగ్ ఏఈ వరప్రసాద్, కోటవురట్ల ఫుడ్ స్టాక్ పాయింట్ వద్ద పిఆర్ ఏ ఈ వర్మను నియమించామన్నారు.