రావికమతం మండలం గర్ణికం గ్రామంలోని మేదర కాలనీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. కారు విజయవాడ నుంచి జి.మాడుగుల వెళ్తున్నట్లు ప్రయాణికులు తెలిపారని కాలనీవాసులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.