అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 4:30 గంటల సమయంలో చోడిపల్లి దేముడు (42) అనే వ్యక్తి సముద్రంలో వేటకు వెళుతూ అలల తాకిడికి నీటిలో పడి మృతి చెందాడు. తోటి మత్స్యకారులు అతన్ని బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.