నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందిన కూటమి (జనసేన) నాయకులు పంచాడ హరినాథ్, రామకృష్ణలను రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికైన వీరిద్దరినీ ఆయన గజమాలతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.