అనకాపల్లి వైపు వెళ్తున్న కారు రేబాక జంక్షన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. వారికి ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.