ఎలమంచిలి మునిసిపాలిటీ పెద్దపల్లిలో నెలకొల్పిన ఏకో ఫ్రెండ్లీ వరసిద్ధి వినాయకుడు వద్ద ప్రతిష్టించిన లడ్డును ఆఖరి రోజు వేలం నిర్వహించగా రూ. 2100కు పందల శేషు దంపతులు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నవరాత్రుల పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమం, మట్టి గణపతి నిమజ్జోత్సవం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ హితంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతిని నెలకొల్పడం ఆనవాయితీగా వస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, చిన్నలు, మహిళలు పాల్గొన్నారు.