మాడుగుల మండలంలోని జంపెనలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన రైతు ధర్మిశెట్టి అచ్యుతరావు (45) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పశువుల పాకలో దాణా ఉడకబెట్టి మంటను పూర్తిగా ఆర్పకుండా పడుకోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ నారాయణరావు తెలిపారు. మంటలు చెలరేగి పాక కాలిపోగా, రైతు తీవ్రంగా గాయపడ్డాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.