పిల్లలు లేరన్న మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన సాయిని తేజ (23) అనే వివాహిత పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో తన నివాస గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్