ఆర్టీవోగా ఎంపికైన నాబార్డ్ గ్రేడ్-A అధికారి

అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగ్‌రావుపేట గ్రామానికి చెందిన గొల్లవిల్లి భరత్ కుమార్ గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రాంతీయ రవాణా అధికారి (RTO)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నాబార్డ్ గ్రేడ్-A అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన భరత్ గ్రూప్-1కి ఎంపిక కావడం గ్రామస్తులకు ఆనందాన్ని కలిగించింది. ఈ విజయం ఆయన కృషికి, పట్టుదలకు నిదర్శనం.

సంబంధిత పోస్ట్