నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పరారీలో ఉన్న ఎన్టీపీఎస్ నిందితుడు కొర్ర మురళిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ జోహార్ గ్రామానికి చెందిన మురళి, ఎన్టీపీఎస్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడిని నర్సీపట్నం న్యాయస్థానంలో హాజరుపరిచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు.