సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 'ట్రాఫిక్ చలాన్ల' పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నేరగాళ్లు వాహనానికి పెండింగ్ చలాన్ ఉందని, వెంటనే లింక్ క్లిక్ చేసి చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని మెసేజ్‌లు పంపిస్తున్నారని, అయితే అధికారిక చలాన్ మెసేజ్‌ల కోసం ఎప్పుడూ జి.ఓ.వి.ఐ.ఎన్. వెబ్‌సైట్‌లను చూడాలని తెలిపారు.