ఆదివారం పరవాడ మండలం చీపురుపల్లి మాలజాలం చెరువులో గేదెలు కడుగుతున్న రెడ్డి రాంబాబు (59) ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు అచ్యుతాపురం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.