రైలులో నుంచి పడిన వ్యక్తి

అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ రైల్వే ట్రాక్ వద్ద, విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి కింద పడిపోయాడు. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న యువకులు ఈ సంఘటనను గమనించి, వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు వారు సహాయం చేశారు. యువకుల సకాలంలో స్పందించడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు దక్కాయి.

సంబంధిత పోస్ట్