కశింకోట మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన విద్యా కమిటీ ఎన్నిక మంగళవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పాఠశాల కమిటీ చైర్మన్గా పెయ్యాల గున్నయ్య, వైస్ చైర్మన్గా చేబోలు చిన్నమ్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా కమిటీ సభ్యులు వీరిని ఎన్నుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన చైర్మన్ పెయ్యాల గున్నయ్య మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సమిష్టి కృషి చేస్తామని, కూటమి నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా సత్కారం అందుకున్నారు.