రాంబిల్లి మండలంలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సీఐ నరసింగరావు తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, అభ్యర్థుల తరఫున పోలింగ్ స్లిప్పుల, ఓటర్ స్లిప్పుల పంపిణీ చేయాలనుకునే వారు తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి (RO) నుంచి ముందస్తు అనుమతి పొందాలన్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే ఈ ప్రక్రియను చేపట్టాలని నిబంధనలు విధిస్తూ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు.