ఉపమాక ఆలయంలో దొంగతనం: సెక్యూరిటీ సిబ్బందిపై వేటు

ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన దొంగతనం కేసును టీటీడీ తీవ్రంగా పరిగణించింది. చోరీ జరిగిన రాత్రి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించిన టీటీడీ, శ్రీ లక్ష్మి మ్యాన్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన సెక్యూరిటీ ఉద్యోగులు చందర్రావు, లక్ష్మణరావులను బుధవారం రాత్రి విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్