నక్కపల్లి మండలం ఉపమాక వేంకన్న ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. బుధవారం ఉదయం పోలీసులు డాగ్‌తో తనిఖీలు చేపట్టగా, ఆలయానికి సమీపంలోని ఓ తోటలో ఆభరణాల మూట లభించింది. అందులో వెండి, కొన్ని బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆలయంలో ఆభరణాలను లెక్కిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.