లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. అగనంపూడికి చెందిన అఖిల్ (25), అజయ్ (20) బైక్‌పై యానాం వెళ్తుండగా, బయ్యవరం వద్ద అర్ధరాత్రి లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన యువకులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్