వెంకన్నపాలెంలో అత్త పసలమ్మ, కోడలు నాగమణిల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం జరిగిన గొడవలో కోడలు కట్టెల కర్రతో కొట్టడంతో అత్త పసలమ్మ అనకాపల్లిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై డీఎస్పీ శ్రావణి శుక్రవారం చోడవరంలో వివరాలు వెల్లడించారు. నాగమణిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.