లక్ష్మీపురం గ్రామంలో ఆలయాల్లో దొంగతనం, పోలీసులకు ఫిర్యాదు

చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలోని ఆంజనేయస్వామి, సాయిబాబా దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి, దేవుని సొమ్మును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆంజనేయ స్వామి గుడిలో ₹30,000 హుండీ చోరీ జరిగిందని, తాజాగా బుధవారం రాత్రి సాయిబాబా గుడిలోనూ దొంగతనం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఎంత సొమ్ము పోయిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలపై చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా రాత్రివేళల్లో కల్లాల్లో కోళ్ల దొంగతనాలు కూడా జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్