వరిలో తెగుళ్ల సమస్యతో రైతులు ఆందోళన

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో వరి రైతులు తెగుళ్ల సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాభావం, దోమకాటు, పాచి తెగుళ్లు, పొడమచ్చల కారణంగా రెండు నెలల క్రితం నాటిన వరి పంట ఎర్రబడుతూ ఎదుగుదల తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం లేక పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు అవసరమైన సలహాలు అందిస్తామని ఏవో అనసూయ గురువారం నాడు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕