మాడుగుల;హౌసింగ్ గడువు ఈనెల 14 వరకు పొడిగింపు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ నిరుపేదల కోసం ఇంటి దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించినట్లు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సోమవారం తెలిపారు. గత నెల 30తో గడువు ముగిసినప్పటికీ, అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారి కోసం ప్రభుత్వం మరో రెండు వారాల సమయం ఇచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్డీఏ కూటమి నాయకులు అర్హులైన వారిని ఈ హౌసింగ్ స్కీములో నమోదు చేయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్