మాడుగుల అగ్ని ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

విశాఖపట్నం, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జంపెన గ్రామానికి చెందిన ధర్మిశెట్టి అచ్యుతారావు (45) బుధవారం మరణించినట్లు ఎస్సై నారాయణరావు తెలిపారు. ఈ నెల మూడో తేదీ రాత్రి, అచ్యుతారావు పశువుల కోసం దానా వండి, మంటను పూర్తిగా ఆర్పకుండా పడుకోవడంతో ప్రమాదవశాత్తు పాకకు మంట అంటుకుంది. ఈ ఘటనలో పాకలోని పశువులకు, అచ్యుతారావుకు మంటలు అంటుకున్నాయి. వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మృతుని భార్య దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్