రౌడీ షీటర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

కే కోటపాడు సిఐ కె కృష్ణ మంగళవారం మాడుగులలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం, గత నెల 27న మాడుగుల మండలం గాదిరాయి సమీపంలో రౌడీ షీటర్ పేచ్చేటి ఉపేంద్ర హత్యకు గురైన కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల రెండో తేదీ సాయంత్రం ఘాట్ రోడ్ జంక్షన్ లో జంపిన గ్రామానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, ఇంకా ఎవరైనా ముద్దాయిలు ఉంటే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై కే నారాయణరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్