పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపక్ అనే యువకుడు 'సేవ్ ట్రీస్ సేవ్ లైఫ్' నినాదంతో బెంగాల్ నుంచి తమిళనాడు వరకు సుమారు 2,100 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ సైకిల్‌పై సాహస యాత్ర చేపట్టాడు. ఈ యాత్రలో భాగంగా మంగళవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవే వద్దకు చేరుకున్నాడు. మరో ఆరు నెలల్లో తమిళనాడు చేరుకుంటానని దీపక్ తెలిపాడు. పలువురు ఈ యువకుడి యాత్రను ఆసక్తిగా తిలకించారు.