కృష్ణదేవిపేటలో తల్లిపాల వారోత్సవాలు

గొలుగొండ మండలం కృష్ణా దేవి పేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో తల్లిపాలు ప్రాముఖ్యతపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు హరి ప్రవీణ్, డాక్టర్ గాయత్రి ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను బాలింతలకు వివరిస్తామని పేర్కొన్నారు. శిశువులకు తల్లిపాలు మించిన ఔషధం లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్