నర్సీపట్నంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం

మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆదేశాల మేరకు, కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు ఆధ్వర్యంలో 24వ వార్డులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి, వార్డులో తిప్పుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపి, అనంతరం దహనం చేశారు.

సంబంధిత పోస్ట్