నాతవరం మండలం వలసంపేట పరిసరాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. జీడితోటల్లో జరుగుతున్న ఈ జూదంపై సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేసి, రెండు కోడి పుంజులు, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.