ఈనెల 5న జాబ్ డ్రైవ్

నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మార్చి 5న క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తాతాజీ తెలిపారు. వందే భారత్ రైళ్లకు స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ ప్రతినిధులు ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ డ్రైవ్‌లో 197 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్