నర్సీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శారదా నగర్ పోస్ట్‌ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, ఫైర్ టీం చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ఘటనలో లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్