నర్సీపట్నం: గంజాయి కేసులో నాలుగేళ్లుగా పరారీ నిందితుడి అరెస్ట్

నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు, 2021 ఆగస్టు 18న రోలుగుంటలో 220 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్న కేసులో నాలుగేళ్లుగా పరారీలో ఉన్న బియ్యాల అప్పలనాయుడు (28)ను అరెస్టు చేశారు. అప్పలనాయుడుపై రోలుగుంటలో 3, కొత్తకోట, ధవళేశ్వరం, నెల్లూరులో ఒక్కో కేసు చొప్పున మొత్తం 6 కేసులు ఉన్నాయని ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్