ఎటువంటి సంజాయిషీ అడగకుండా తనను సస్పెండ్ చేయడం ఏంటని నర్సీపట్నం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, 17వ వార్డు కౌన్సిలర్ జి. ఆదిలక్ష్మి ప్రశ్నించారు. శనివారం ఆమె నర్సీపట్నంలో మాట్లాడుతూ 2011 నుంచి వైసీపీలో ఉన్నామన్నారు. డిసెంబర్ 31న స్పీకర్ సమక్షంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరైనందుకు తనను సస్పెండ్ చేయడం సమంజసం కాదన్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం వైసీపీ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు.