నర్సీపట్నం: నాటుకోడి రూ.3,000

నర్సీపట్నంలో నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. సంక్రాంతి పండగ పురస్కరించుకొని శనివారం ఉదయం మార్కెట్లో ఒక్కొక్క కోడి సుమారు రూ. 3 వేలు ధర పలికింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు చెబుతున్న రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోడిపందేలు జరగబోతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగినట్లు కొంతమంది రైతులు పేర్కొన్నారు. ఈ ఒక్కరోజే లక్షల రూపాయలలో వ్యాపారం జరుగుతుందని అంచనా. మీ ఏరియాలో ఎంతో కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్