నర్సీపట్నం: గంజాయి రవాణా.. మహిళతో పాటు మరో ఆరుగురి అరెస్ట్

నర్సీపట్నం DSP శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురిని గురువారం ఉదయం కేడీపేట చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. CI రేవతమ్మ, SI రుషికేశ్వరరావు బృందం వీరి నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజవొమ్మంగికి చెందిన ప్రధాన నిందితుడు రాజుపై ఇప్పటికే 14 కేసులు నమోదై ఉన్నాయని, వీరి నుంచి ఒక కారు, మూడు స్కూటీలను స్వాధీనం చేసుకున్నామని DSP శ్రీనివాసరావు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్