నర్సీపట్నంలో గ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆదివారం గ్యాస్ సరఫరా అవుతుందని సమాచారం అందడంతో, ఉదయం 5 గంటల నుంచే పలువురు వినియోగదారులు సిలిండర్లతో బారులు తీరారు. బుక్ చేసుకున్న నెల రోజుల తర్వాత కూడా సిలిండర్లు అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.