ఉపాధి కూలీలను ఢీకొట్టిన వ్యాన్.. మహిళ మృతి

నక్కపల్లిలో సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళుతున్న కూలీలను వ్యాన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బద్దా సత్యవతి అనే కూలీ మార్గమధ్యంలోనే మృతి చెందగా, ఏనుగుపల్లి సత్యవతి, చిన్న నూకమ్మ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కేజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎస్సీ కాలనీ నుంచి కూలీలు ఉపాధి పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్