విశాఖ జిల్లాలోదారుణ ఘటన

పరవాడ మండలంలోని వాడచీపురుపల్లి శివారులో మంగళవారం రాత్రి మగ శిశువు మృతదేహం కలకలం రేపింది. ముళ్ల పొదల్లో శిశువు మృతదేహం ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.సీఐ మల్లికార్జునరావు, ఎస్సై సురేశ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువు మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు.మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్