విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి. త్రినాధరావు సోమవారం వెల్లడించారు. ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, అందుకు తగిన ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.