పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో అమ్మవారి నిమజ్జనం సందర్భంగా భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న అప్పికొండ త్రినాథ్ (56) అనే వ్యక్తి డీజే సౌండ్ ఎక్కువ కావడంతో హఠాత్తుగా మృతి చెందారు. డ్రైవర్‌గా పనిచేసే త్రినాథ్‌ను గ్రామస్థులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.