మూడు రోజులుగా నీటి సరఫరా నిలిపివేత.. ప్రజల ఇక్కట్లు

జీవీఎంసీ 88 వార్డు, వెదుల్లనరవ, నంగి, నారపాడు, గంగవరం, దువ్వాడ గ్రామాలకు మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఉడా ఫోన్ సిగ్నల్ టవర్ కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తుండగా వాటర్ సప్లై లైన్ దెబ్బతినడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇటీవల వేసిన రోడ్లు కూడా గుంతలమయంగా మారాయి. ఈ సమస్యలపై ఉన్నత అధికారులు స్పందించి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్